టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి
ఆసిఫాబాద్‌రూరల్: ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఎస్‌టీయూ అధ్యక్షుడు మాణిక్‌రావు, ప్రధాన కార్యదర్శి తుకారాం అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్‌టీ యూ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. 2010 కంటే నియామకమైన ఉపాధ్యాయుల విషయంలో చట్టసవరణ చేయాలని డిమాండ్ చేశా రు. పీఆర్‌సీ ప్రకటించాలని, ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు బకాయిలు చెల్లించాలన్నారు. జనవరిలో టెట్ రాసే ఉపాధ్యాయులకు ఆన్‌డ్యూటీ సౌకర్యం కల్పించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు సంజయ్ కుమార్, బాదిరావు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.


