
ఎన్‌సీడీ వ్యాధిగ్రస్తులపై దృష్టి సారించాలి
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాలో ఎన్‌సీడీ వ్యాధిగ్రస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి సీతారాం అన్నారు. ఎన్‌సీడీ వ్యాధిగ్రస్తులకు నిర్వహించే పరీక్షలు, వైద్యసేవలపై శుక్రవా రం జిల్లా కేంద్రంలో వైద్యాధికారులు, సిబ్బందికి ప్రోగ్రాం అధికారి వినోద్‌తో కలిసి అవగాహన క ల్పించారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ నాన్ కమ్యూనికేబుల్ డిసీస్ బాధితులకు క్రమపద్ధతిలో వైద్యం అందించాలన్నారు. సికిల్‌సెల్ ప్రోగ్రాంలో భాగంగా గిరిజన గ్రామాల్లో స్క్రీనింగ్ నిర్వహించా లని సూచించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు, సూపర్‌వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.