
రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలి
ఆసిఫాబాద్‌అర్బన్: ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని ఆసిఫాబాద్ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. ఈ నెల 12న అంతర్జాతీయ నర్సులు దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం చేయడం ద్వారా ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉండదన్నారు. స్టాఫ్ నర్సుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. శిబిరంలో 15 మంది పాల్గొనగా, 15 యూనిట్ల రక్తం సేకరించారు. కార్యక్రమంలో స్టాఫ్ నర్సుల సూపరింటెండెంట్ ఇందుమతి, హెడ్ నర్సులు ఏసుకరణ, సఫియా, కుసుమ, స్టాఫ్ నర్సులు శ్రీదేవి, పద్మ, సృజన, సునీత, సుమిత్ర, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.