
సాదాబైనామాలే అధికం
ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పెంచికల్‌పేట్ మండలం లోడుపల్లి గ్రామానికి చెందిన రైతు పెద్దల పోశం. లోడుపల్లి శివారులో ఎకరం భూమికి పాత పట్టా పాసుపుస్తకం ఉంది. నూతన పట్టా పాసు పుస్తకం కోసం ఇటీవల రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేసుకున్నాడు.
పెంచికల్‌పేట్(సిర్పూర్): భూభారతి చట్టాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో పెంచికల్‌పేట్ మండలాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసింది. ఈ నెల 5 నుంచి ప్రారంభమైన రెవెన్యూ సదస్సులు ఈ నెల 19 వరకు కొనసాగనున్నాయి. భూసమస్యలు పరిష్కరించడానికి రైతుల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. చేడ్వాయి, దరోగపల్లి, అగర్‌గూడ గ్రామాల్లో ఇప్పటివరకు మూడు రోజులపాటు సదస్సులు నిర్వహించారు. గురువారం వరకు 174 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నా రు. దరఖాస్తుల వివరాలను అధికారులు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ఎక్కువగా సాదాబైనామాల సమస్యలతోనే ప్రజలు వస్తున్నారు.
మూడు బృందాల ఏర్పాటు
గ్రామాల్లో రెవెన్యూ సదస్సుల నిర్వహణ కోసం అధికారులతో కూడిన మూడు బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో తహసీల్దార్‌తో పాటు ఆరుగురు సిబ్బందిని నియమించారు. తహసీల్దార్లు వెంకటేశ్వరరావు, కవిత, సురేశ్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు జరిగిన సదస్సుల్లో చేడ్వాయి గ్రామంలో 95, జనకపూర్‌లో 66, అగర్‌గూడలో 13 దరఖాస్తులు స్వీకరించారు. రైతులు ఎక్కువగా లావుణి పట్టా దరఖాస్తులు, డిజిటల్ సైన్, సాదా బైనామాలు, విరాసత్, నూతన పట్టా పాసుపుస్తకం, విస్తీర్ణంలో మార్పులపై సమస్యలు విన్నవిస్తున్నారు.
వ్యవసాయ భూమి విస్తీర్ణం 15,724 ఎకరాలు
పైలట్ మండలంగా పెంచికల్‌పేట్ ఎంపిక
ఈ నెల 19 వరకు గ్రామాల్లో భూభారతి రెవెన్యూ సదస్సులు
ఇప్పటివరకు 174 దరఖాస్తులు స్వీకరణ
మండలం వివరాలు

సాదాబైనామాలే అధికం