
ఆలయాలకు మహర్దశ
● డీడీఎన్ పథకంలో చేరేందుకు దరఖాస్తుల ఆహ్వానం ● ఉమ్మడి జిల్లాలో 729 మంది అర్చకులు
ఆసిఫాబాద్‌అర్బన్: ప్రాచీన, నూతనంగా నిర్మించిన ఆలయాల్లో ప్రతీరోజు ధూపదీప నైవేద్యం కొనసాగాలన్న ఉద్దేశంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి వైఎస్సార్ ప్రభుత్వం 2007లో ధూపదీప నైవేద్యం పథకం ద్వారా అర్చకులను నియమించింది. నాటి నుంచి అనేక ఆలయాలు ఈ పథకం ద్వా రా వెలుగులోకి వచ్చాయి. అంతేకాకుండా ని రుద్యోగ అర్చకులకు ఉపాధి లభించింది. ప్రస్తుతం డీడీఎన్ పథకంలో పని చేస్తున్న అర్చకులకు ప్రతీనెల రూ.10వేల చొప్పున ఆర్థికసాయం అందిస్తున్నారు. ఇందులో రూ.4వేలు ధూపదీప నైవేద్యాలకు, రూ.6 వేలు గౌరవ భృతి కింద చెల్లిస్తున్నారు. ఈ పథకంలో నూతనంగా చేరేందుకు ఈ నెల 24 వరకు దరఖాస్తులు కోరుతూ తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈమేరకు అర్హత, ఆసక్తి కలిగిన ఆలయాల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇందుకు ఆల యం నిర్మించి కనీసం 15 సంవత్సరాలు అయి ఉండాలన్న ప్రాధమిక నిబంధన విధించారు. డీడీఎన్ పథకంలో చేరాలంటే మొదట ఆలయం దేవాదా య శాఖలో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ అయి ఉండాలన్న నిబంధన ఉంది. కానీ కొన్ని ఆలయాలకు రిజి స్ట్రేషన్ లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
2007లో ప్రారంభం
2007లో పథకం రూపుదిద్దుకుంది. ప్రారంభంలో ధూపదీప నైవేద్యాల కోసం నెలకు. రూ.2,500ల చొప్పున చెల్లించేవారు. 2018లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మొత్తాన్ని రూ.6 వేలకు పెంచారు. ఆ తర్వాత రూ. 10 వేలకు పెంచుతూ జీవో విడుదల చేశారు. ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి హయాంలో పథకం విజయవంతంగా కొనసాగుతోంది. చూసేందుకు చిన్నమొత్తంగా కనిపించినా.. పూజారులకు ఇస్తున్న గౌరవ భృతిని మాత్రం అన్ని ప్రభుత్వాలు ఆదరిస్తున్నాయి. డీడీఎన్ పథకంలో కొనసాగుతున్న అర్చకులకు ఉద్యోగ భద్రతో పాటు, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం, ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.
2022లో చివరిసారిగా..
15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆలయాలు ఈ పథకానికి ప్రాధమిక అర్హతగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు 2022లో చివరిసారిగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 725 ఆలయాలు పథకం ద్వారా నెలనెలా రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం పొందుతున్నాయి. మూడేళ్లలో 15 సంవత్సరాలు పూర్తి చేసుకొన్న ఆలయాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారుగా మరో 120 వరకు ఉంటాయని అంచనా వేస్తున్నారు.
వేతనాలు పెంచాలి
ధూపదీప నైవేద్యం పథకంలో పనిచేస్తున్న అర్చకులకు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి. ఈఎస్‌ఐ, పీఎఫ్, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలి. వీటితో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యత కల్పించాలి.
– ఒజ్జల శిరీష్‌శర్మ,
డీడీఎన్‌స్కీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డీడీఎన్ పథకంలో కొనసాగుతున్న ఆలయాలు
జిల్లా ఫేజ్–1 ఫేజ్–2 ఫేజ్–3 మొత్తం
ఆదిలాబాద్ 30 81 44 155
ఆసిఫాబాద్ 26 43 34 103
నిర్మల్ 49 113 111 273
మంచిర్యాల 51 91 56 198
మొత్తం 156 328 245 729

ఆలయాలకు మహర్దశ