‘భూభారతి’లో సమస్యల వెల్లువ!
సాక్షి, ఆసిఫాబాద్: ధరణి స్థానంలో రాష్ట్ర సర్కారు ప్రతిష్టాత్మకంగా భూభారతి చట్టాన్ని అమల్లోకి తె చ్చింది. ఈ పథకం అమలులో భాగంగా జిల్లాకు ఒక మండలాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసింది. ఆ మండలంలో సదస్సులు నిర్వహించిన అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పెంచికల్‌పేట్ మండలాన్ని ‘పైలట్’గా ఎంచుకున్నారు. ఈ 15 గ్రామాల నుంచి 399 దరఖాస్తులు రాగా.. అందులో 227 దరఖాస్తులను పరిష్కరించిన అధికారులు.. మరో 172 దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచారు.
ఈ నెల 19 వరకు సదస్సులు నిర్వహణ
పెంచికల్‌పేట్ మండలంలో ఈ నెల 5 నుంచి 19 వరకు భూభారతి చట్టం ద్వారా భూ సమస్యల పరి ష్కారం కోసం సదస్సులు ఏర్పాటు చేశారు. ఇందులో అధికారులకు వందల సంఖ్యలో అర్జీలు వచ్చా యి. చేడ్వాయి, కొండపల్లి, లోడ్‌పల్లి, ఎల్కపల్లి, బొంబాయిగూడ, గుంట్లపేట, జన్కాపూర్, పోతేపల్లి, ఎల్లూర్, ఆగర్‌గూడ, కమ్మార్‌గాం, కోయచిచ్చాల, మురళీగూడ, పెంచికల్‌పేట్, తేలపల్లి గ్రామాల నుంచి మొత్తం 399 దరఖాస్తులు స్వీకరించినట్లు రెవెన్యూ అధికారులు వెల్లడించారు. ఇందులో ప్రధానంగా అర్జీదారులు అసైన్డ్(పీవోటీ), సాదాబైనామా, వారసత్వ మార్పిడి గురించి ఎక్కువగా అడిగారు. అదేవిధంగా భూ హద్దుల సమస్యలు, పేర్లు సరిచేయడం, భూ విస్తీర్ణంలో తేడాలు, భూములు నిషేధిత జాబితాలోకి ఎక్కడం, సర్వే నంబర్ల మిస్సింగ్ తదితర సమస్యల పరిష్కారం కోసం అధికారులకు విన్నవించారు.
మూడు ప్రత్యేక బృందాలు...
పెంచికల్‌పేట్ మండంలోని 15 గ్రామాల నుంచి వచ్చిన దరఖాస్తులను మొదట అధికారులు భూభా రతి పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఇందులో 383 దరఖాస్తులను భూభారతి పోర్టల్‌లో డిజిటలైజేషన్ చేయగా.. మిగిలిన 16 దరఖాస్తుల ను డిజిటలైజేషన్ పనిలో అధికారులు నిమగ్నమై ఉన్నారు. అనంతరం క్షేత్రస్థాయిలో పరిశీలించేందు కు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ముగ్గురు తహసీల్దార్ల నేతృత్వంలోని సిబ్బంది దరఖాస్తుదారులకు నోటీసులు అందజేసి వారి సమక్షంలోనే సమస్య పరిష్కరిస్తున్నారు. మొత్తం 399 అర్జీల్లో అసైన్డ్ 92, సాదాబైనామా 37, మిస్సింగ్ సర్వే నంబర్లు 76, డీఎస్ పెండింగ్ 102, వారసత్వ మార్పిడి కోసం 11 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో సాదాబైనామా, అసైన్డ్ దరఖాస్తులను పరిష్కరించకుండా పెండింగ్‌లో ఉంచారు.
అర్జీల వివరాలు
అంశాలు అర్జీలు
అసైన్డ్(పీఓటీ) 92
సాదాబైనామా 37
డీఎస్ పెండింగ్ 102
మిస్సింగ్ సర్వేనంబర్లు 76
వారసత్వ మార్పిడి 11
ఇతర దరఖాస్తులు 81
పైలట్ మండలం ‘పెంచికల్‌పేట్’లో 399 అర్జీలు
తొమ్మిది అంశాలపై అత్యధిక దరఖాస్తులు
227 దరఖాస్తులకు పరిష్కారం.. పెండింగ్‌లో 172


