లోకరక్షకుడు యేసు
ఆసిఫాబాద్/కాగజ్‌నగర్‌టౌన్: ప్రేమ, కరుణ, సేవాభావమే మానవాళికి అసలైన మార్గమని చాటిచెప్పిన కరుణామయుడు యేసుక్రీస్తు జన్మదిన వేడుకలు జిల్లావ్యాప్తంగా ఘనంగా జరిగాయి. బుధవారం అర్ధరాత్రి నుంచే క్రిస్మస్ సంబురాలు అంబరాన్నంటాయి. గురువారం క్రిస్మస్ పర్వదినాన్ని క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. చర్చీల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసి, కేక్‌లు కట్ చేశారు. పాస్టర్లు మాట్లాడుతూ లోకరక్షకుడు యేసు క్రీస్తు అని అన్నారు. ప్రతిఒక్కరూ ప్రేమ, కరుణ కలిగి ఉండాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని దస్నాపూర్ న్యూలైఫ్ ఏజీ చర్చి, జన్కాపూర్, రాజంపేట, సందీప్‌నగర్, జుబ్లీ మార్కెట్, కౌటాల, యాపలగూడ, కాగజ్‌నగర్ పట్టణంలోని సీఎస్‌ఐ, ఫాతిమా, పెంతెకోస్తల్, మమ్రేబ్రదమ్ చర్చీల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి చిన్నారులకు తినిపించారు. పాస్టర్లు, ఫాదర్లు రాజశేఖర్, ఇమాన్యూయల్ సత్యం, జోషి, యేసుకుమార్ తదితరులు పాల్గొన్నారు.


