దయనీయం.. దర్జీ జీవనం | - | Sakshi
Sakshi News home page

దయనీయం.. దర్జీ జీవనం

Dec 26 2025 8:18 AM | Updated on Dec 26 2025 8:18 AM

దయనీయ

దయనీయం.. దర్జీ జీవనం

ఆన్‌లైన్‌ షాపింగ్‌, రెడీమేడ్‌ దుస్తులతో ఆగమాగం ఆర్డర్లు లేక పనులు కరువు ప్రభుత్వం ఆదుకోవాలని వినతి జిల్లాలో 800 కుటుంబాలు

కౌటాల మండల కేంద్రంలోని ప్రగతి కాలనీకి చెందిన 55 ఏళ్ల కొండి ఓదేలు 20 సంవత్సరాలు టైలర్‌గా పనిచేస్తున్నాడు. రెండేళ్ల క్రితం పక్షవాతం రావడంతో మంచాన పడ్డాడు. ఓదేలుకు భార్య పల్లవి, మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. టైలర్‌ పనిచేస్తేనే పూట గడిచే ఈ కుటుంబ పెద్ద అనారోగ్యం పాలుకావడంతో పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంది. వైద్య ఖర్చులు, కుటుంబ పోషణకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాతలు, ప్రభుత్వం స్పందించి చేయూతను అందించాలని వేడుకుంటున్నారు.

కాగజ్‌నగర్‌ పట్టణానికి చెందిన శివ అనే యువకుడు దర్జీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. చేతినిండా పనులు లేక కుటుంబ పోషణ భారంగా మారింది. ఆర్థిక ఇబ్బందులతో ఇటీవల రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబం రోడ్డున పడింది. ఆన్‌లైన్‌ షాపింగ్‌, రెడీమేడ్‌ దుస్తుల కారణంగా సంప్రదాయ దర్జీలకు చేతినిండా పని దొరకడం లేదు.

కౌటాల(సిర్పూర్‌): ఒకప్పుడు సందడిగా కనిపించే టైలర్‌ దుకాణాలు నేడు పనిలేక వెలవెలబోతున్నా యి. ఆధునిక కాలంలో ఆన్‌లైన్‌ షాపింగ్‌తో పాటు రెడీమేడ్‌ దుస్తుల రాకతో దర్జీల వద్ద బట్టలు కుట్టించుకునే వారు కరువయ్యారు. మారుతున్న కాలనుగుణంగా వృత్తిలో కొత్త ప్రయోగాలు చేస్తున్నా ఫలి తాం ఉండటం లేదు. గతంలో టైలర్‌ షాపులు మూ డు పువ్వులు.. ఆరు కాయలుగా విరాజిల్లేవి. పెళ్లిళ్లు, పండుగలు, ఇతర వేడుకలకు కొత్త బట్టలను కుడుతూ ఏడాదంతా బిజీగా ఉండేవారు. ఒక్కో షాపులో పది నుంచి 12 మంది ఉపాధి పొందేవారు. నేడు ఈ పరిస్థితి మారింది. చిన్నారుల నుంచి వయస్సు మీరిన వారు కూడా రెడీమేడ్‌ దుస్తులు ధరిస్తున్నారు. రూ.లక్షలు వెచ్చించి టైలర్‌ షాపులు ఏర్పాటు చేసుకున్న వారు అప్పులపాలవుతన్నారు.

వందలాది మందికి ఆధారం

జిల్లాలో సుమారు 800 దర్జీ(మేరు కులస్తులు) కు టుంబాలు ఉన్నాయి. ఆసిఫాబాద్‌లో 280, కాగజ్‌నగర్‌లో 200, వాంకిడి, కౌటాల మండలాల్లో వంద వరకు కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. మండ ల కేంద్రాల్లో సుమారు నాలుగు వందల వరకు టైలరింగ్‌ షాపులు కొనసాగుతుండగా, గ్రామాల్లో చా లా వరకు ఉన్నాయి. కొంతమంది యువతులు, మ హిళలు కూడా టైలరింగ్‌ నేర్చుకుని కుటుంబానికి ఆసరాగా ఉంటున్నారు. వందలాది మంది టైలరింగ్‌పై ఆధారపడుతున్నారు. అయితే పొద్దంతా పనిచేసినా కూలి గిట్టడం లేదని చెబుతున్నారు. ఎప్పుడో ఒకసారి వచ్చే డ్రెస్‌లు కుడుతూ మిగితా సమయాల్లో ఖాళీగా ఉంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల యూనిఫాం ఆర్డర్లు దర్జీలకు అప్పగిస్తే ఆర్థికభారం నుంచి గట్టెక్కుతామని వారు పేర్కొంటున్నారు. అలాగే ప్రభుత్వం బ్యాంకు రుణాలు అందించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

ఖాళీగా ఉంటున్నాం

రెడీమేడ్‌ దుస్తుల వాడకంతో పని లేక ఖాళీగా ఉంటున్నాం. రెండు, మూడు రోజులకు ఒక డ్రెస్సు కుడతున్నాం. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. దర్జీలకు ప్రభుత్వం పావల వడ్డీ రుణాలు ఇవ్వాలి. ఇళ్లు లేని వారికి స్థలంతోపాటు ఇందిరమ్మ ఇళ్ల ఇచ్చి ఆదుకోవాలి.

– లోడెల్లి శైలేష్‌, సీనియర్‌ టైలర్‌, కౌటాల

యూనిఫామ్‌ల టెండర్లు ఇవ్వాలి

వసతి గృహాలు, పాఠశాల విద్యార్థుల యూనిఫామ్‌లు కుట్టేందుకు స్థానిక టైలర్లకు టెండర్లు ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం దర్జీల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి. కుల వృత్తులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలి.

– ఎన్‌.సత్యనారాయణ, టైలర్‌, కౌటాల

జిల్లాలోని దర్జీ కుటుంబాల వివరాలు

మండలం కుటుంబాలు

ఆసిఫాబాద్‌ 280

వాంకిడి 100

కాగజ్‌నగర్‌ 200

కౌటాల 100

చింతలమానెపల్లి 50

పెంచికల్‌పేట్‌ 30

దహెగాం 40

దయనీయం.. దర్జీ జీవనం1
1/1

దయనీయం.. దర్జీ జీవనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement