
కవి సమ్మేళనంలో రాధాకృష్ణాచారి
ఆసిఫాబాద్‌అర్బన్: తెలుగు భాషకు పట్టాభిషేకం పేరుతో హైదరాబాద్‌లోని త్యాగరాయ గానసభలో గురువారం నిర్వహించిన కవి సమ్మేళనంలో ఆసిఫాబాద్‌కు చెందిన కవుల సంఘం ప్రచార కార్యదర్శి రాధాకృష్ణాచారి కవితాగానం చేశారు. ప్రముఖ కవులతో ప్రశంసలు అందుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఇలికాల పురుషోత్తం, లక్ష్యసాధన సమితి చైర్మన్ ప్రజ్ఞారాజ్, తెలుగు భాష చైతన్య సమితి అధ్యక్షుడు బడేసాబ్ తదితరులు రాధాకృష్ణాచారిని శాలువా లు, పూలమాలతో సత్కరించి, ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందించారు. ఆకసం ప్రతినిధులు శ్రీరాం సత్యనారాయణ, మాడుగుల నారాయణమూర్తి, సభ్యులు గుర్రాల వెంకటేశ్వర్లు, ధర్మపురి వెంకటేశ్వర్లు, తూమోజు సురేష్‌చారి ఆయనను ప్రత్యేకంగా అభినందించారు.