
ముగిసిన పాలిసెట్ శిక్షణ
ఆసిఫాబాద్: కాగజ్‌నగర్ పట్టణంలోని డివిజ న్ రిసోర్స్ సెంటర్‌లో నిర్వహిస్తున్న ఉచిత పాలిసెట్ శిక్షణ శిబిరం మంగళవారంతో విజ యవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి మాట్లాడుతూ సమాజంలో అసమానతలు తగ్గించడానికి విద్యే అత్యుత్తమ ఆయుధమన్నారు. జిల్లాలో పేద విద్యార్థులు అధికంగా ఉన్నందున ఉచిత శిక్షణ శిబిరాన్ని నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి మధుకర్, ఎంఈవో ప్రభాకర్, అధ్యాపకులు పాల్గొన్నారు.