● మూడో ప్రయత్నంలో ఐఏఎస్ సాధించా.. ● ఆత్మవిశ్వాసంతో సాగితే లక్ష్యసాధన సులువే ● ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా మనోగతం
‘నన్ను కలెక్టర్‌గా చూడాలనేది మా నాన్న కల.. దాన్ని ఎలాగైనా నెరవేర్చాలని పాఠశాల స్థాయిలోనే నిర్ణయించుకున్నా.. ఆయన అందించిన ప్రోత్సాహంతో ముందుకు సాగా.. రెండుసార్లు విఫలమయ్యా.. అయినా నిరాశ చెందలేదు.. రాత్రింబవళ్లు మరింత కష్టపడి చదివా.. లోటుపాట్లు సవరించుకుని ముందడుగు వేశాను. మూడో ప్రయత్నంలో విజయం సాధించా.. 2023 యూపీఎస్సీ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 29వ ర్యాంకు సాధించా.. ఐఏఎస్‌గా తెలంగాణ క్యాడర్‌కు ఎంపికయ్యా.. నాన్న కల నెరవేర్చడం నాకెంతో ఆనందానిస్తోంది.. ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను అమలు చేసి, పేదలకు సేవ చేయడమే లక్ష్యమని అంటున్నారు ఆదిలాబాద్ జిల్లాకు నూతనంగా విచ్చేసిన ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా. ‘సాక్షి’కి మంగళవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. – కై లాస్‌నగర్
నాన్న కల నెరవేర్చా..