
విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకోవాలి
ఆసిఫాబాద్‌రూరల్: విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకుని దానిని సాధించే దిశగా పట్టుదలతో ముందుకెళ్లాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. ఆసిఫాబాద్ మండలం గుండి గ్రా మంలోని ప్రభుత్వ పాఠశాలలో మొదటిసారి ఉత్తీర్ణత సాధించిన పదో తరగతి బ్యాచ్ వి ద్యార్థులను శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి స న్మానించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యనందించేందు కు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దీపక్ తివారి, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, నాయకులు రవీందర్, మల్లేశ్, సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ తదితరులు పాల్గొన్నారు.