అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
ఆసిఫాబాద్‌అర్బన్: నిరుపేదల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హులకే ఇళ్లు మంజూరు చేస్తామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లాకేంద్రంలోని జన్కాపూర్ వార్డు నంబర్– 1 ఎస్సీ కాలనీలో శుక్రవారం ఇందిర మ్మ ఇళ్ల జాబితాలోని దరఖాస్తుదారుల వివరాలు పరిశీలించారు. ఆదాయం, కుటుంబ నేపథ్యం, రేషన్ కార్డు, ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జాబితాలో అనర్హుల పేర్లు ఉంటే విచారించి వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. జాబితాలో దరఖాస్తుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ భుజంగరావు, అధికారులు పాల్గొన్నారు.
మొక్కలు సంరక్షించాలి
ఆసిఫాబాద్‌రూరల్: నర్సరీల్లో పెంచుతున్న మొ క్కలను సంరక్షించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మండలంలోని అడ గ్రామంలో ఏర్పా టు చేసిన నర్సరీని శుక్రవారం డీఆర్‌డీవో దత్తారా వుతో కలిసి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ వేసవిలో మొక్కలు ఎండిపోకుండా సకాలంలో నీరందించాలన్నారు. పశువులు రాకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం అడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఆస్పత్రిలో వార్డులు, సిబ్బంది హాజరును పరిశీలించారు. ముందస్తు అనుమతి లేకుండా వైద్యులు, సిబ్బంది విధులకు గైర్హాజరు కావొద్దన్నారు. గర్భణులను అంబులెన్స్‌లో తీసుకురావాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో రమేశ్, వైద్యసిబ్బంది తదితరులు ఉన్నారు.


