కంపెనీ ప్రారంభిస్తా
నేను వరంగల్ జవహర్ నవోదయ విద్యాలయంలో చదువుకున్నాను. ఐఐటీ చదివేందుకు రాష్ట్రంలోని నవోదయ విద్యాలయాల నుంచి ఎంపికయ్యా. అలా కాగజ్‌నగర్‌లో 12వ తరగతి ఐఐటీ కోసం వచ్చా ను. ఇక్కడ వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఉండడంతో అన్ని భాషలు నేర్చుకునే అవకాశం కలిగింది. చదువు పూ ర్తయ్యాక కంపెనీ ప్రారంభించి ఉపాధి చూ పుతా. – మణిదీప్, 12వ తరగతి, వరంగల్
ఇండియా ఉన్నతంగా
ఉండాలి
కొత్త సంవత్సరంలో ఇండియా ప్రపంచంలోనే ఉన్నతంగా ఉండాలి. అన్ని దేశాలకు ఆదర్శం కావాలి. యుద్ధాలు, అల్లర్లు ఆగిపోవాలి. అనేక రంగాల్లో భారత్ ఒక మోడల్‌గా ఉంది. రానున్న సంవత్సరాల్లోనూ ఇలాగే కొనసాగాలి.
– లాస్య, 9వ తరగతి, బోథ్
కంపెనీ ప్రారంభిస్తా


