అభివృద్ధి పనులు పూర్తి చేయాలి
● అదనపు కలెక్టర్ దీపక్‌తివారి
ఆసిఫాబాద్: జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం గృహనిర్మాణ శాఖ పీడీ ప్రకాశ్‌రావు, జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి, డీపీవో భిక్షపతి, ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఉత్తం జాడేతో కలిసి ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఎంఈవోలు, ఏపీవోలు, విద్యుత్, ఇంజినీరింగ్ శాఖ అఽధికారులతో సమావేశమయ్యారు. ఇందిరమ్మ ఇళ్లు, పాఠశాలల అభివృద్ధి పనులు, ఇంకుడు గుంతల నిర్మాణం, పాఠశాలల్లో సివిల్ పనులు, పారిశుద్ధ్య పనులు, ఉపాధిహామీ పనులపై సమీక్షించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచాలన్నారు. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను సమన్వయంతో పూర్తిచేయాలని ఆదేశించారు.


