యాంకరింగ్ చేశా
2025 జనవరి 1న విద్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో నేను యాంకరింగ్ చేశా. అది నాకు ఎంతో ప్రేరణతోపాటు చెప్పలేని సంతోషాన్ని ఇచ్చింది. అలాగే ఈ సంవత్సరం ఆనందంగా గడవాలని ఆకాంక్షిస్తున్నాను. భవిష్యత్తులో డిబేట్ స్పీకర్, జర్నలిస్టుగా రాణిస్తా.
– రౌతు అలేఖ్య,
పదో తరగతి, చింతలమానెపల్లి
అందరూ బాగుండాలి
కరోనా సమయంలో నవోదయ విద్యాలయంలో చేరాను. అప్పటి నుంచి విద్యాలయం చాలా అభివృద్ధి చెందింది. కొత్త ఏడాదిలో కొత్త ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసి డిజిటల్ క్లాస్‌లు నిర్వహించేందుకు అధ్యాపకులు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రంథాలయంలో అన్ని సౌకర్యాలు కల్పించారు.
– మహిక, 11వ తరగతి, మందమర్రి
యాంకరింగ్ చేశా


