జాతీయస్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని గిరిజ న ఆదర్శ క్రీడాపాఠశాలకు చెందిన విద్యార్థులు జాతీయస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికయ్యారని డీఎస్‌వో షేకు తెలిపారు. పాఠశాల ఆవరణలో మంగళవారం పీడీ మీనారెడ్డి, కో చ్‌లు విద్యాసాగర్, తిరుమల్, అరవిండ్, హె చ్‌ఎం లింబారావు, ఏటీడీవో శివకృష్ణతో కలి సి అభినందించారు. ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో పాఠశాలకు చెందిన జంగుబాయి, నాగేశ్వరి, వైష్ణవి, శ్రీలత, సోనీ ఉత్తమ ప్రతిభ చూపి జాతీయ స్థాయికి ఎంపికయ్యారన్నారు. ఈ నెల 31 నుంచి జనవరి 4 వరకు కర్ణాటకలో జాతీయ స్థాయి ఖోఖో పోటీలు జరుగుతాయని తెలిపారు.


