కరాటేలో కాంస్య పతకం
లింగాపూర్(ఆసిఫాబాద్): మంచిర్యాలలో ఈ నెల 21న జరిగిన రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో లింగాపూర్ మండలం పిక్లాతండాకు చెందిన బానోత్ అంగూరీ కాంస్య పతకం సాధించింది. ఈ మేరకు మండల కేంద్రంలోని తహసీ ల్దార్ కార్యాలయంలో సర్పంచ్ జాదవ్ రాజశేఖర్, డిప్యూటీ తహసీల్దార్ పెద్దిరాజు మంగళవారం విద్యార్థినిని శాలువాతో సత్కరించా రు. కాగా అంగూరీ ప్రస్తుతం జైనూర్ మండలం భూసిమెట్టలోని గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. కార్యక్రమంలో కరాటే మాస్టర్ జె.గణేశ్, పంచాయతీ కార్యదర్శి రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


