‘నవోదయ’లో రోబోటిక్స్ ఎగ్జిబిషన్
కాగజ్‌నగర్‌టౌన్: జవహర్ నవోదయ విద్యాలయంలో మంగళవారం రోబోటిక్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఎస్పీఎం వైస్ ప్రెసిడెంట్ అమరేంద్ర కుమార్ మిశ్రా మాట్లాడుతూ రోబోలను వ్యవసాయం, కర్మాగారాలు, వైద్యచికిత్సల నిమిత్తం వివిధ రంగాల్లో ఉపయోగిస్తారని తెలిపారు. కొన్ని సందర్భాల్లో మనుషులు చేయలేని పనులను సైతం అవి సమర్థవంతంగా నిర్వహించగలవన్నారు. సైన్స్ కార్యక్రమాలు విద్యార్థుల్లో సృజనాత్మకత, శాసీ్త్రయ దృక్పథం పెంపొందిస్తాయని తెలిపారు. కొత్త ఆవిష్కరణలకు మార్గం చూపుతాయని అన్నారు. రోబోటిక్స్ ఎగ్జిబిషన్‌లో విద్యార్థులు 32 మోడళ్లను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కశాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి, వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మీనరసింహం, అధ్యాపకులు ఐలయ్య, ప్రధానోపాధ్యాయుడు రేపాల కృష్ణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


