పోలీస్ స్టేషన్లు తనిఖీ
దహెగాం/పెంచికల్‌పేట్/కాగజ్‌నగర్‌రూరల్: ద హెగాం, పెంచికల్‌పేట్ మండల కేంద్రాల్లోని పోలీస్ స్టేషన్లతోపాటు కాగజ్‌నగర్ మండలంలోని ఈజ్‌గాం స్టేషన్‌ను మంగళవారం ఎస్పీ నితిక పంత్ తనిఖీ చేశారు. ముందుగా స్టేషన్ల పరిసరాలను పరిశీలించారు. అనంతరం సిబ్బంది వివరాలు, రికార్డులను తనిఖీ చేసి, సిబ్బందికి సూచనలు చేశారు. నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు చేపట్టాలని ఆదేశించారు. కాగజ్‌నగర్ డీఎస్పీ వహీదుద్దీన్, ఎస్సైలు విక్రమ్, అనిల్‌కుమార్, కల్యాణ్, సిబ్బంది ఉన్నారు.


