ఐఏఎస్ అవుతా..
ప్రపంచ దేశాల్లో ‘భారత్’ వెలిగిపోవాలి అంతరిక్ష రంగంలో కొత్త ఆవిష్కరణలు రావాలి మహిళలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించాలి న్యూఇయర్ నేపథ్యంలో ‘సాక్షి’తో నవోదయ విద్యాలయం విద్యార్థులు
2025లో ఎంత సంతోషంగా ఉన్నానో.. కొత్త ఏడాది ఇదే కొనసాగాలి. విద్యాలయంలో క్రమశిక్షణ, నాణ్యమైన విద్య అందిస్తున్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చినవారు స్నేహితులయ్యారు. మిత్రులందరూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలి. నేను ఐఏఎస్ అధికారిగా సమాజానికి సేవ చేస్తా.
– అఖిల్, 6వ తరగతి, జైనథ్
కాగజ్‌నగర్‌టౌన్: గడిచిన కాలం ఒక జ్ఞాపకం... రాబోయే కాలం ఒక ఆశ.. తీపి, చేదు అనుభవ పాఠాలను 2025లో వదిలేసి... కొత్త ఆశయాలు, రెట్టింపు ఉత్సాహంతో 2026లోకి అడుగుపెట్టేశాం. చీకటిని చీల్చుకుంటూ వచ్చే ‘నవోదయం’లా.. మన జీవితాల్లో వెలుగులు నింపేందుకు కొత్త సంవత్సరం వచ్చేసింది. ఈ క్రమంలో న్యూఇయర్‌లో ప్రతీఒక్కరి జీవితం ఆరోగ్యంగా, ఆనందంగా సాగాలి.. ప్రపంచ దేశాల్లో భారత్ వెలిగిపోవాలి’ అని కాగజ్‌నగర్ జవహర్ నవోదయ విద్యార్థులు ఆకాంక్షించారు. బుధవారం ‘సాక్షి’ వారిని ప్రత్యేకంగా పలకరించింది. కొత్త ఏడాదిలో నూతన ఆవిష్కరణలు రావాలని, అన్నిరంగాల్లో రాణిస్తున్న మహిళలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించాలని వారు కోరారు.
ఆవిష్కరణలు రావాలి
కొత్త సంవత్సరంలో భారతదేశం నుంచి అంతరిక్ష రంగంలో కొత్త ఆవిష్కరణలు రావాలి. ప్రపంచ దేశాలకు దీటుగా నిలబడాలి. శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి అడుగుపెట్టి ఇండియాకు పేరు తెచ్చారు. నేను కూడా అంతరిక్ష ఆవిష్కరణలు చేసి అంతరిక్షంలోకి అడుగు పెట్టాలని ఉంది. – విహాన్ తేజ్, 6వ తరగతి, కాసిపేట, మం.తాండూర్
కొత్త సమాజం చూడబోతున్నా..
ఆరు నుంచి నవోదయలో చదువుకుంటున్నా. 12వ తరగతి పూర్తయితే 2026లో ఉన్నత చదువు కోసం బయటకు వెళ్లాల్సిందే. అక్కడ కొత్త సమాజం, కొత్త మిత్రులను చూడబోతున్నాను. సమాజంలో ఏవిధంగా ఉండలో నేర్చుకుంటాను. సివిల్స్‌కు సన్నద్ధమై కలెక్టర్ అవుతా. సమాజానికి సేవ చేస్తాను. ప్రభుత్వం మహిళలను ప్రొత్సహించాలి. – యశస్విని, 12వ తరగతి, మంచిర్యాల
ఐఏఎస్ అవుతా..
ఐఏఎస్ అవుతా..
ఐఏఎస్ అవుతా..
ఐఏఎస్ అవుతా..


