
‘గ్రంథాలయాల్లోని సమస్యలు పరిష్కరిస్తాం’
ఆసిఫాబాద్: జిల్లాలోని గ్రంథాలయాల్లో నెలకొన్న సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని రాష్ట్ర గ్రంథా లయ సంస్థ చైర్మన్ ఎండీ రియాజ్ అన్నారు. కాగజ్‌నగర్ పట్టణంలో బుధవారం ఎమ్మెల్సీ దండె విఠల్ ను కలిశారు. గ్రంథాలయాలు లేని మండల కేంద్రాల్లో వెంటనే ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కోరారు. అనంతరం రియాజ్‌ను శాలువాతో సత్కరించారు.
పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
తిర్యాణి(ఆసిఫాబాద్): కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని, కష్టపడిన వారికి గుర్తింపు లభిస్తుందని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండీ రియాజ్ అన్నారు. మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన సంవిధాన్ బచావో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో రాజ్యాంగాన్ని, అంబేడ్కర్ ఆశయాలను నిర్వీర్యం చేసే దిశగా బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు. దీనికి దీటుగా సమాధానం చెప్పేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ చైర్మన్ అన్నయ్యగౌడ్, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్‌చార్జి సుగుణ తదితరులు పాల్గొన్నారు.