
అర్హత పరీక్షకు స్పందన
కాగజ్‌నగర్‌రూరల్: పట్టణంలోని డీఆర్‌సీ భవనంలో ఆదివారం నిర్వహించిన ఆర్‌జీ రా వు ట్రస్ట్ అర్హత పరీక్షకు స్పందన లభించింది. ఇంటర్మీడియెట్‌తోపాటు ఐఐటీ శిక్షణ, ఉచిత అడ్మిషన్ కోసం అర్హత పరీక్ష నిర్వహించగా 200 మంది విద్యార్థులు హాజరయ్యారు. ట్రస్ట్ కాలేజీ ఇన్‌చార్జి దినేశ్ మాట్లాడుతూ మొ దటి బ్యాచ్‌లో పది మంది విద్యార్థులు జాతీ యస్థాయిలో ర్యాంకులు సాధించడం గర్వకారణమన్నారు. విద్యార్థుల ఆర్థిక స్థితికి అనుగుణంగా వారికి రెండేళ్లపాటు ఉచిత విద్య అందిస్తామని తెలిపారు. జిల్లా సైన్స్ అధికా రి, కార్యక్రమ కోఆర్డినేటర్ మధుకర్, ఎంఈ వో ప్రభాకర్, ఉపాధ్యాయులు తిరుపతయ్య, మోహన్, శ్రీశైలం, త్రివేణి, రవికుమార్, వేణు, విష్ణు, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.