
దూరప్రయాణం తేలికై ంది
జిల్లా మీదుగా చేపట్టిన 363 జాతీయ రహదారితో ఈ ప్రాంత ప్రజలకు దూరప్రాంత ప్రయాణం కూడా ఎంతో తేలికై ంది. ఒకప్పుడు కాగజ్‌నగర్ నుంచి మంచిర్యాలకు వెళ్లాలంటే రెండు గంటలు ప్రయాణించాల్సి వచ్చేది. జాతీయ రహదారిపై ఇప్పుడు కేవలం 30 నిమిషాల్లో చేరుకోగలుగుతున్నాం. అలాగే హైదరాబాద్– మంచిర్యాల, మంచిర్యాల– బెల్లంపల్లి, బెల్లంపల్లి– గడ్చిరోలి వరకు గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులు చేపట్టాలి. మంచిర్యాల– హైదరాబాద్ రాష్ట్రీయ రహదారిని జాతీయ రహదారిగా మారిస్తేనే ఉత్తర తెలంగాణ అభివృద్ధి చెందుతుంది.
– సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు