
భూసమస్యల పరిష్కారానికే సదస్సులు
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
పెంచికల్‌పేట్(సిర్పూర్): భూ సమస్యల పరిష్కారానికే ప్రభుత్వం భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోందని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. మండలంలోని దరోగపల్లి, చేడ్వాయి గ్రామాల్లో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులను బుధవారం కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి పరిశీలించారు. కలెక్టర్ పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికై న పెంచికల్‌పేట్ మండలంలో ఈ నెల 20 వరకు మూడు ప్రత్యేక బృందాలతో రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు. అనంతరం ఐకేపీ ఆధ్వర్యంలో ఎల్కపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. రైతులకు ఇబ్బందులు లేకుండా తాగునీరు, నీడ, ఓఆర్‌ఎస్ సౌకర్యాలు కల్పించాలని, గోనె సంచులు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ధాన్యాన్ని ట్యాగింగ్ చేసిన రైస్ మిల్లులకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. తహసీల్దార్లు వెంకటేశ్వర్‌రావు, కవిత, శ్రీనివాస్, సిబ్బంది ఉన్నారు.