
క్రీడాభివృద్ధికి పూర్తి సహకారం
ఆసిఫాబాద్‌అర్బన్: క్రీడాభివృద్ధికి పూర్తి సహకారం ఉంటుందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగిన 38వ జాతీయ స్థాయి సీనియర్ నెట్‌బాల్ క్రీడా పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన కీర్తన, దీప్తిలతో పాటు ఎస్‌జీఎఫ్ నేషనల్ జూనియర్ క్రీడా పోటీల్లో ప్రతిభ కనబర్చిన సాయి దీక్ష, అర్చన, సంజనలను బుధవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే శాలువాలతో ఘనంగా సన్మానించి ప్రత్యేకంగా అభినందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో క్రీడలకు ప్రత్యేక కోటా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో నెట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు, సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్, డీవైఎస్‌వో రమాదేవి, నాయకులు నిసార్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.