
ఆర్మీకి మద్దతుగా ఆలయంలో పూజలు
ఆసిఫాబాద్‌అర్బన్: భారత ఆర్మీ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతం కావాలని జిల్లా కేంద్రంలోని కేశవనాథస్వామి ఆలయంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి శుక్రవారం పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఒజ్జల నరేశ్ శర్మ, శిరీష్ శర్మ స్వామివారికి గణపతి పూజ, శ్రీదేవి భూదేవి సమేత కేశవనాథ స్వామివారికి పురుషసూక్త అభిషేకం, మంగళహారతి, మంత్రపుష్పం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ శత్రుదేశం పాకిస్తాన్‌పై మన రక్షణ బలగాలు చేపడుతున్న విరోచిత పోరాటానికి 140 కోట్లు ప్రజలు అండగా ఉండాలన్నారు. ఉగ్రవాదం అంతం కావాలని ప్రపంచ దేశాలు భారత్‌కు మద్దతు ఇవ్వడం శుభ సూచకమన్నారు. ఈ సందర్భంగా భారత్ మాతాకీ జై.. జై జవాన్.. జై కిసాన్.. అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో వైరాగడె మనోజ్, సుగుణాకర్, ఖాండ్రె విశాల్, గంధం శ్రీనివాస్, రవికుమార్ జోషి, శంకర్‌రావ్, సురేష్‌చారి, సంతోష్‌కుమార్, మహిళలు పాల్గొన్నారు.