
బోధన మెరుగుపర్చుకోవాలి
ఆసిఫాబాద్‌రూరల్: ఉపాధ్యాయులు బోధన తీరు మెరుగుపర్చుకోవాలని శిక్షణ ప్రత్యేకాధికారి, అదనపు డైరెక్టర్ శ్రీనివాసచారి అన్నా రు. జిల్లా కేంద్రంలోని బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి గురువారం డీఈవో యాదయ్యతో కలిసి హాజరయ్యారు. ఆయన మా ట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచాలన్నారు. ప్రధానోపాధ్యాయులు నా యకత్వ లక్షణాలు కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్‌లు శ్రీనివాస్, అబిద్, జిల్లా సైన్స్ అధికారి మధుకర్, శిక్షణ కేంద్రం ఇన్‌చార్జి రమేశ్, రిసోర్స్‌పర్సన్ అనురాధ పాల్గొన్నారు.