
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలో గురువారం ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో మొత్తం ఏడు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉ దయం నిర్వహించిన మొదటి సంవత్సరం ప రీక్షకు జనరల్ విభాగంలో 551 మంది విద్యార్థులకు 511 మంది హాజరు కాగా, ఒకేషనల్ విభాగంలో 53 మందికి 42 మంది హాజరయ్యారు. మొత్తం 604 మందికి 553 మంది పరీక్షలు రాయగా, 51 మంది గైర్హాజరయ్యా రు. సెకండియర్ పరీక్షకు జనరల్ విభాగంలో 201 మందికి 189 మంది హాజరు కాగా, ఒకేషనల్ విభాగంలో 11 మందికి 8 మంది హాజరయ్యారు. మొత్తం 212 మందికి 197 మంది పరీక్ష రాయగా, 15 మంది గైర్హాజరయ్యారని డీఐఈవో కళ్యాణి తెలిపారు. కాగజ్‌నగర్‌లో ప్రభుత్వ జూనియర్ కళాశాల, వసుంధర కళాశాలను తనిఖీ చేశారు.