
భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంతి
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని కేస్లాపూర్ హనుమాన్ ఆలయంలో గురువారం హనుమాన్ జయంతి భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అర్చకుడు ఒజ్జల శిరీష్‌శర్మ గణపతిపూజ, స్వస్తి పుణ్యహవచనము, నవగ్రహారాధన, రుద్రాభిషేకం, ఫల, పత్ర, పుష్పార్చన, మంగళహారతి, మహా మంత్రపుష్పం, మహాదాశీర్వచనం, తీర్థప్రసాద వితరణ చేశారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి దంపతులు, అదనపు కలెక్టర్ డేవిడ్ దంపతులు, ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు అరిగెల నాగేశ్వర్‌రావు, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్, నాయకులు బాలేశ్‌గౌడ్, మల్లేశ్ తదితరులు ప్రత్యేక పూజలు చేశారు.

భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంతి