‘ఆపరేషన్ కగార్ నిలిపివేయాలి’
ఆసిఫాబాద్: ఛత్తీస్‌గఢ్‌లోని కర్రెగుట్ట ప్రాంతంలో చేపట్టిన ఆపరేషన్ కగార్ నరమేధాన్ని వెంటనే నిలిపివేయాలని తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కోవ విజయ్‌కుమార్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం మా వోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని డి మాండ్ చేశారు. పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరుగుతున్న యుద్ధంలో అమాయకులైన ఆదివాసీలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. మానవ హక్కులను హరిస్తున్నారని మండిపడ్డారు. మావోయిస్టులపై జరుగుతున్న హత్యాకాండను ఖండించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చందన్‌షా, నాయకులు భీమ్‌రావు, సుభాష్, కనక ప్రకాశ్, బాదిరావు, రామ్‌కిషన్ పాల్గొన్నారు.


