గుండాల పంచాయతీ కార్యవర్గ ప్రమాణ స్వీకారం.. ఇచ్చోడలో
ఇచ్చోడ: మండలంలోని గుండాల పంచాయతీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని గ్రామంలో కాకుండా మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ గ్రామంలో 2018 సంవత్సరంలో రెండు వర్గాల మధ్య తలెత్తిన గొడవల్లో ఇద్దరు మృతి చెందిన విషయం విదితమే. శాంతి భద్రతల సమస్య తలెత్తకూడదనే ఉద్దేశంతో గ్రామంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎస్పీ అనుమతి ఇవ్వలేదు. ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం సర్పంచ్ షరీఫాబితో పాటు ఉపసర్పంచ్, వార్డు సభ్యులతో ఎంపీడీవో నరేశ్ ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతలు అప్పగించారు.


