గ్రామాల అభివృద్ధిలో సర్పంచులే కీలకం
సారంగపూర్: గ్రామాల సమగ్ర అభివృద్ధిలో సర్పంచులదే కీలకపాత్ర అని నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి అన్నారు. మండలంలోని ధని, జామ్, ఆలూరు గ్రామాల్లో నూతనంగా ఎన్నికై న సర్పంచుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల సమగ్ర అభివృద్ధికి గ్రామ పంచాయతీ సర్పంచులే కీలకమన్నారు. గత కొంతకాలంగా సర్పంచులు లేక అభివృద్ధి కుంటుపడిందని, ఇకపై గ్రామాల బాధ్యతలను సర్పంచులు స్వీకరించారని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. గ్రామపంచాయతీల అభివృద్ధికి తనవంతు కృషి ఎల్లవేళలా అందిస్తానన్నారు.
నిర్మల్ రూరల్: మండలంలోని 20గ్రామపంచాయతీల్లో పాలకవర్గాలు పదవీ బాధ్యతలు చేపట్టాయి. ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి చిట్యాల, అనంతపేట, తలువేద గ్రామాల్లో జరిగిన ప్రమాణస్వీకార మహోత్సవానికి హాజరై నూతన పాలకవర్గాలకు శుభాకాంక్షలు తెలియజేశారు.


