పాన్ ఇండియా ప్రస్థానం!
బొగ్గు ఉత్పత్తిలో సింగరేణికి 136 ఏళ్ల చరిత్ర భవిష్యత్ సవాళ్లతో ఇతర రంగాల్లోకి విస్తరణ నేడు సింగరేణి ఆవిర్భావ దినోత్సవం
రామకృష్ణాపూర్: సింగరేణి సంస్థ బ్రిటీష్ కాలంలో పురుడుపోసుకుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లందు బొగ్గుట్టలో 1889లో బొగ్గు తవ్వకాలు ప్రారంభమయ్యాయి. 1920 డిసెంబర్ 23న సింగరేణి కాలరీస్ కంపెనీగా ఏర్పడింది. 1927లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి, 1961లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామగుండం, 1991లో ఉమ్మడి వరంగల్ జిల్లా భూపాలపల్లిలో బొగ్గుగనులు ఒక్కొక్కటిగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని గోదావరి, ప్రాణహిత నది పరీవాహక ప్రాంతాల్లో సుమారు 450 కిలోమీటర్ల పరిధిలో బొగ్గు నిక్షేపాలను భూగర్భశాఖ అధికారులు గుర్తించారు. 1889లో 59,671 టన్నుల బొగ్గు ఉత్పత్తితో కంపెనీ ప్రస్థానం మొదలైంది. జాతీయీకరణ తర్వాత సంస్థలో రాష్ట్ర ప్రభుత్వం వాటా 51 శాతం, కేంద్ర ప్రభుత్వం వాటా 49 శాతం ఉంది.
కార్మికుల త్యాగాలతో మనుగడ..
సింగరేణి సంస్థ మనుగడకు కార్మికుల త్యాగాలే కారణమని చెబుతుంటారు. ప్రకృతికి విరుద్ధంగా ప్రాణాలకు తెగించి భూగర్భంలోకి దిగి చెమటోడ్చి పనిచేశారు. ఆ కష్టమే నేడు సంస్థ సింగరేణి స్థిరత్వానికి పునాదిగా నిలిచాయి. యాంత్రీకరణతో ప్రమాదాలు కొంతమేర తగ్గినా అక్కడక్కడ చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు లక్షా పైచిలుకు కార్మికులు ఉండగా, ప్రస్తుతం వారి సంఖ్య సుమారు 40వేలకు చేరింది.
పరిమిత స్థాయిలో వేడుకలు
గతంలో ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించగా, ఈసారి పరిమిత స్థాయిలో జరుపనున్నారు. నిధులను సైతం భారీగా తగ్గించారు. జీఎం కార్యాలయాల్లోనే వేడుకలు నిర్వహించనున్నారు. దీనిపై కార్మిక సంఘాల నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నిధులు తగ్గించినట్లుగా చెబుతున్నా.. గతం నుంచి వస్తున్న సంప్రదాయాలకు విలువ తగ్గిందని సంఘాలు ఆరోపిస్తున్నాయి.
136 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన
సింగరేణి కంపెనీ ప్రస్థానం పాన్ ఇండియా స్థాయికి చేరింది. ఆటుపోట్లను తట్టుకుంటూ దేశంలోని నవరత్న కంపెనీలకు దీటుగా నిలుస్తోంది. కార్మికుల చెమట చుక్కలతో నిలిచిన సంస్థ.. నేడు బొగ్గు ఉత్పత్తిలోనే కాకుండా సంక్షేమ కార్యక్రమాల ద్వారా గుర్తింపు సాధించింది. డిసెంబర్ 21న సింగరేణి ఆవిర్భావ దినోత్సవం నిర్వహించనున్న నేపథ్యంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
సింగరేణి వివరాలు
కంపెనీ విస్తరణ : ఆరు జిల్లాలు
కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల,
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం
భూగర్భ గనులు : 22
ఓపెన్ కాస్టు గనులు : 17
ఉద్యోగుల సంఖ్య: 42,000
నూతన బొగ్గుబావుల ఏర్పాటుకు యాజమాన్యం చర్యలు తీసుకుంటున్నా పర్యావరణ నిబ ంధనలు, అటవీశాఖ అనుమతులు, పర్మిషన్లు, భూసేకరణ సవాల్‌గానే మారింది. దీంతో బొ గ్గు ఉత్పత్తితోపాటు ప్రత్యామ్నాయ రంగాలపై కంపెనీ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. మూతపడిన భూగర్భ గనుల్లో మిగిలిపోయిన బొగ్గును ఓపెన్‌కాస్ట్‌ల ద్వారా తవ్వడంతోపాటు ఇతర రంగాల వైపు అడుగులు వేస్తోంది. భవిష్యత్ అవసరాల కోసం ఇతర ఖనిజాల అన్వేషణపై కూడా ఫోకస్ పెట్టింది. అలాగే పునరుత్పాదక శక్తి రంగంలో పెట్టుబడులు పెడుతోంది. రాజస్తాన్‌లో 1500 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు అనుమతులు లభించాయి. అదే రాష్ట్రంలో మరో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు కూడా కేబినేట్ ఆమోదం లభించింది. రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్, గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్, నైనీ బ్లాక్ వద్ద 800 మెగా వాట్ల విద్యుత్ ప్లాంట్, మణుగూరులో జియో థర్మల్ ప్లాంట్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం, బొగ్గు నుంచి అమ్మోనియం నైట్రేట్ ఉత్పత్తికి సన్నాహాలు చేస్తోంది. కర్ణాటకలో బంగారు గనుల కోసం ప్రణాళికలు సిద్ధమవుతుండగా.. అనుబంధంగా 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రంపైనా దృష్టి సారించింది.
పాన్ ఇండియా ప్రస్థానం!


