
యూటీఎఫ్ ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని బాలు ర ఉన్నత పాఠశాలలో సోమవారం యూటీఎ ఫ్ ఆధ్వర్యంలో టాలెంట్ టెస్టు నిర్వహించా రు. ముందుగా జిల్లా పరీక్షల నిర్వహణ అధి కారి టాలెంట్ టెస్టు ప్రశ్నపత్రాలను విడుదల చేశారు. అనంతరం యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు శాంతికుమారి మాట్లాడుతూ పీపుల్స్ ప్రొగ్రెసివ్ ట్రస్ట్ ద్వారా టాలెంట్ టెస్టు నిర్వహించామని తెలిపారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు ఐదో తరగతి నుంచి డిగ్రీ వరకు హాస్టల్ వసతితో కూడిన ఉచిత విద్యనందిస్తారని తెలిపారు. 87 మంది విద్యార్థులకు 81 మంది పరీక్షకు హాజరయ్యారని పేర్కొన్నా రు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా కార్యదర్శి కమలాకర్‌రెడ్డి, నాయకులు తిరుపతి, భరత్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.