
క్రీడాదుస్తులు పంపిణీ
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని గిరిజ న ఆదర్శ క్రీడాపాఠశాల మైదానంలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపునకు హాజరైన విద్యార్థులకు శుక్రవారం డీఎస్‌వో మీనారెడ్డి, ఏసీఎంవో ఉద్దవ్ క్రీడాదుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు సమ్మర్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వేసవి సెలవుల్లో క్రీడా నైపుణ్యం పెంపొందించుకునేందుకు ఈ క్యాంపులు దోహదపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో కోచ్‌లు విద్యాసాగర్, అరవింద్, తిరుమల్ హెచ్‌ఎం జంగు, పీడీ, పీఈటీలు లక్ష్మణ్, పాండు, అరవింద్, రవీందర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.