
పేదలు సద్వినియోగం చేసుకోవాలి
ఆసిఫాబాద్‌అర్బన్: సీఎం సహాయనిధి చెక్కులను నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో గురువారం లబ్ధిదారులకు ఎమ్మెల్యే కోవ లక్ష్మి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకునే బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సీఎంఆర్‌ఎఫ్ అండగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్, మాజీ సర్పంచ్ మర్సుకోల సరస్వతి తదితరులు పాల్గొన్నారు.