నది ఒడ్డున.. దందా
కౌటాల మండలం తాటిపల్లి సమీపంలో వార్దా నది సరిహద్దున మహారాష్ట్ర ప్రాంతం ఉంది. మహారాష్ట్రలోని దళారులు తాటిపల్లి వార్దా నది మార్గంలో కౌటాల పశువుల వారసంతకు పశువులను తరలిస్తున్నారు. చంద్రపూర్, ఛతీస్‌గఢ్, గడ్చిరోలి జిల్లాలతోపాటు సిందేవాయి, వాడ్సా, భ్రమపూరి ప్రాంతాల నుంచి వందల పశువులను నదిలో నుంచి ప్రమాదకరంగా తాటిపల్లి ఒడ్డుకు చేరుస్తున్నారు. అక్కడి నుంచి ఓ ముఠా వాహనాల్లో తరలిస్తుండగా.. కొందరు ఎద్దులను జతలు కట్టి కౌటాలకు రోడ్డు మార్గంలో తీసుకెళ్తున్నారు. ఒక రాష్ట్రానికి చెందిన పశువులను మరో రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఈ వ్యవహారమంతా అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదు.


