విద్యార్థులకు సన్మానం
ఆసిఫాబాద్‌రూరల్: నెట్‌బాల్ పోటీల్లో ప్రతిభ చూపి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను జిల్లా కేంద్రంలోని తన నివా సంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి శుక్రవారం సన్మానించారు. ఈ సందర్భంగా నెట్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అలీబిన్ మాట్లాడుతూ నెట్‌బాల్ బాల్ ట్రెడిషన్‌లో జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్‌కు చెందిన విద్యార్థులు సాయిదీక్ష, రోహాన్, ఫాస్ట్ ఫైలో వంశీవర్ధన్ ప్రతిభ చూపారని తెలిపారు. జాతీయస్థాయిలో క్రీడాకారులు రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నెట్‌బాల్ జిల్లా కార్యదర్శి తిరుపతి, నాయకులు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.


