సమస్యలు పరిష్కరించాలని వినతి
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాలోని వివిధ గ్రంథాలయాల్లో పనిచేస్తున్న పార్ట్ టైం స్వీపర్ల సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం హైదరాబాద్‌లో గ్రంథాలయ డైరెక్టర్ శ్రీహరికి జిల్లా సంఘం నాయకులు వినతిపత్రం అందించారు. పార్ట్‌టైం స్వీపర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్ మాట్లాడుతూ వేతనాల్లో తారతమ్యాలు లేకుండా అన్ని జిల్లాల్లో ఒకేవిధంగా చెల్లించాలన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ.20వేలు అందించాలని, అర్హత, సర్వీసుకు అనుగుణంగా కేటగిరీ పోస్టుల్లోకి తీసుకోవాలన్నారు. సానుకూలంగా స్పందించిన ఆయన త్వరలోనే రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్‌తో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మధు, సభ్యులు సలీం, స్వామి తదితరులు పాల్గొన్నారు.


