రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీలకు ఎంపిక
ఆసిఫాబాద్‌రూరల్: రాష్ట్రస్థాయి 24 మంది క్రీడాకారులు ఎంపికయ్యారని నెట్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అలీబిన్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో బుధవారం జిల్లాస్థాయి నెట్‌బాల్ బాలబాలికల ఎంపిక పోటీలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పోటీల్లో 60 మంది క్రీడాకారులు హాజరు కాగా, ఉత్తమ ప్రతిభ చూపిన 12 మంది బాలికలు, 12 బాలురు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారని వెల్లడించారు. కార్యక్రమంలో నెట్‌బాల్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.


