
అనాథను ఆదరించి.. డిగ్రీ చదివించి..
పాయల్‌కు హల్దీ మెహింది ఫంక్షన్ చేసిన కార్పొరేటర్, హోం నిర్వాహకులు
అనాథ అయితేనేం.. ఒక పెద్ద కుటుంబమే ఆమెకు అండగా నిలబడింది. పెద్దలంతా, ముఖ్యంగా మహిళలంతా పెద్దిదిక్కులా మారి ఆమెకు ఘనంగా పెళ్లి చేయాలని నిర్ణయించారు ఇందులోనే భాగంగా హల్దీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రెండేళ్ల వయసులో అనాథలా రైల్వే స్టేషన్‌లో దొరికిన యువతి పెళ్లివార్త ఇపుడు సోషల్ మీడియాలో విశేషంగా నిలిచింది. పదండి ఆ వివరాలేంటో తెలుసుకుందాం.
రాంగోపాల్‌పేట్: రెండేళ్ల వయసులో రైల్వే స్టేషన్‌లో దొరికి పోలీసుల సహకారంతో ఆశ్రమానికి వచ్చింది. నిర్వాహకులే కుటుంబ సభ్యులై అన్నీ చూసుకున్నారు. పాయల్‌కు రెండేళ్ల వయసున్నపుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఉండగా పోలీసులు హిల్‌స్ట్రీట్ పాఠశాల ఆవరణలోని ఆశ్రయ్ రెయిన్‌బో హోంకు అప్పగించారు. రెండేళ్ల వయసు నుంచి అక్కడే ఉంటూ డిగ్రీ ఆమె ఇక్కడే పూర్తి చేసింది.
ఇదీ చదవండి: Operation Sindoor సలాం, హస్నాబాద్!
ఆ తరువాత ఆప్థమాలజీ కోర్సు పూర్తి చేసి ఓ ఆప్టికల్ షాపులో ఉద్యోగం చేస్తుంది. చందానగర్‌కు చెందిన యువకుడిని ఇష్టపడింది. దీంతో ఆశ్రమ నిర్వాహకులు పెళ్లిచేయాలని నిర్ణయించారు. ఆశ్రమం నిర్వాహకులు గ్రేస్.. కార్పొరేటర్ కొంతం దీపిక మరికొంత మంది దాతల దృష్టికి ఈ విషయాన్ని తీసుకుని వెళ్లారు. బుధవారం రాత్రి ఆశ్రమం ఆవరణలో ఉత్సాహంగా మెహిందీ ఫంక్షన్ నిర్వహించారు. వైభవంగా ఆ మూడు ముళ్ల వేడుకను పూర్తిచేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
చదవండి: వెయిటర్ టు కరోడ్‌పతి: కె.ఆర్. భాస్కర్ ఇన్‌స్పైరింగ్ జర్నీ