రెబ్బెన: మంచిర్యాల టూ మహారాష్ట్ర సరిహ ద్దు వరకు నిర్మించిన 363 జాతీయ రహదారి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకో కుండా పటిష్ట బందోబస్తు నిర్వహిస్తామని ఏఎస్పీ చిత్తరంజన్ అన్నారు. ఈనెల 5న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ జాతీయ రహదారిని జాతికి అంకితం చేయనున్న నేపధ్యంలో ప్రారంభో త్సవ ఏర్పాట్లను శనివారం ఏఎస్పీ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ హెలిప్యాడ్ నుంచి మంత్రి సభాస్థలికి చేరుకునే వరకు పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సభకు హాజర య్యే ప్రజలకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నా రు. ఈ కార్యక్రమంలో సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్‌బాబు, ఏఎస్పీ ప్రభాకర్‌రావు, సబ్ కలెక్టర్ శ్రద్ధాశుక్లా, సీఐ బుద్దె స్వామి, ఎస్సై చంద్రశేఖర్, నేషనల్ హైవే పీడీ అజయ్ మణికుమార్, ఈవెంట్ మేనేజర్ అనూప్, తదితరులు పాల్గొన్నారు.