డిస్పోజబుల్‌ ప్లాస్టిక్‌తో ఇంటిని అందంగా మార్చేద్దాం ఇలా..! | Home Decor Tips: Amazing Home Decor Ideas Out Of Disposable Plastic | Sakshi
Sakshi News home page

డిస్పోజబుల్‌ ప్లాస్టిక్‌తో ఇంటిని అందంగా మార్చేద్దాం ఇలా..!

May 4 2025 1:51 PM | Updated on May 4 2025 2:47 PM

Home Decor Tips: Amazing Home Decor Ideas Out Of Disposable Plastic

యూజ్‌ అండ్‌ త్రో లేదా డిస్పోజబుల్‌ బాటిల్స్‌ మాత్రమే కాదు ఆహార పదార్థాల డబ్బాలు కూడా మన ఇంట్లో చేరుతుంటాయి. వాటిలోని పదార్థాలు తిన్న తర్వాత, అవి చెత్తలో పడేస్తుంటాం. ఈ రోజుల్లో మన దినచర్యలోకి వచ్చిన ఈ డిస్పోజబుల్‌ ప్లాస్టిక్‌ అంతా పర్యావరణాన్ని దెబ్బతీసేదే! 
డిస్పోజబుల్‌ ప్లాస్టిక్‌ను ఎంత తక్కువగా ఉపయోగిస్తే అంత మంచిదనే ఆలోచనతో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, వీటి వాడకం తప్పనిసరి అవుతోంది. ఇలాంటప్పుడు వాటిని చెత్తగా మార్చకుండా, అలంకార వస్తువులుగా వాడుకోవడం కొంత నయం.

స్వీట్‌ కప్స్‌తో..
వాడిన ప్లాస్టిక్‌ బాక్సులను శుభ్రం చేసి, వాటికి పెయింట్స్‌ వేసి, అద్దాలను అతికించి వాల్‌ హ్యాంగింగ్స్‌ తయారుచేసుకోవచ్చు. ప్లాస్టిక్‌ బాటిల్స్‌ను విభిన్న రంగులతో తీర్చి, దానికి జనప దారాలను ఉపయోగించి మినీ ప్లాంటేషన్‌ వాల్‌ను క్రియేట్‌ చేయవచ్చు. 

బొమ్మల తయారీ
శుభ్రం చేసిన ప్లాస్టిక్‌ బాక్స్‌లు, కొన్ని పూసలు, గ్లూ సాయంతో పిల్లలను ఆకట్టుకునే బొమ్మలను డిజైన్‌ చేయవచ్చు. పిల్లల చేత వాటిని తయారుచేయించి, వారిలో సృజనాత్మకతను పెంపొందించవచ్చు. 

క్రియేటివ్‌ షెల్ఫ్‌
డిస్పోజబుల్‌లోనూ ఎకో–ఫ్రెండ్లీ ఐటమ్స్‌ వస్తున్నాయి. వాటిని పెన్నులు, పెన్సిళ్లు వంటి వస్తువులు వేసుకోవడానికి హోల్డర్స్‌ ఈ రీయూజ్‌ బాక్స్‌లతో డిజైన్‌ చేసుకోవచ్చు.  

(చదవండి: అక్కడ నేటికి విసుర్రాళ్లతోనే..)

Advertisement
 
Advertisement
Advertisement