ట్రంప్‌ సుంకాలకు..‍బ్రష్‌ దెబ్బ..! | Chinese made toilet brush Look Like Trumps Hair style Agains his Tariffs | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ సుంకాలకు..‍బ్రష్‌ దెబ్బ..!

May 4 2025 3:08 PM | Updated on May 4 2025 3:22 PM

Chinese made toilet brush Look Like  Trumps Hair style Agains his Tariffs

అమెరికా–చైనా సుంకాల యుద్ధం ఇప్పుడు టాయిలెట్‌కి చేరింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ముఖంతో తయారు చేసిన పసుపు కుచ్చు టాయిలెట్‌ బ్రష్‌ చైనాలో వైరల్‌గా మారింది. ఈ బ్రష్‌ కుచ్చు అచ్చం ట్రంప్‌ జుట్టు మాదిరిగానే ఉంటుంది. చైనా ఉత్పత్తులపై అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతీకారంగా చైనీయులు ‘యివు కౌంటర్‌టాక్‌’ అంటూ ఇలా టాయిలెట్‌ బ్రష్‌లతో వ్యంగ్యంగా బదులిస్తున్నారు. 

వీటిని మార్కెట్‌లో రూ.160 నుంచి రూ.220 వరకు విక్రయిస్తున్నారు. ట్రంప్‌ మీద చైనా ప్రజల కోపతాపాలు పెరిగినట్లుగానే, ప్రస్తుతం వీటికి గిరాకీ భారీగా పెరిగింది. చాలా స్టోర్స్‌లలో వీటికి ‘ఔటాఫ్‌ స్టాక్‌’ బోర్డులు పెట్టేస్తున్నారు. అంతేకాదు, సోషల్‌ మీడియాలోనూ ‘బ్రష్‌ ట్రంప్‌’ హ్యాష్‌ టాగ్‌ ట్రెండ్‌ అవుతోంది. 

మరెంతోమంది ఈ ట్రంప్‌ బ్రష్‌లను ఉపయోగించి, వివిధ ఫన్నీ మీమ్స్, కామెంట్లతో సోషల్‌ మీడియాను ఊపేస్తున్నారు. ఏదీ ఏమైనా, మొత్తానికి చిన్నదైనా ఈ టాయిలెట్‌ బ్రష్‌ విసిరిన పొలిటికల్‌ పంచ్‌ భారీగానే ఉంది కదూ!

(చదవండి: Canadian vlogger: ‘భారత్‌.. నాకెన్నో పాఠాలు నేర్పింది.. కానీ ఇక్కడే ఉండలేను కదా!’)

 

Advertisement
 
Advertisement
Advertisement