పగలబడి నవ్వేందుకు పది కారణాలు... | World Laughter Day 2025: Why is Laughter Important for Health | Sakshi
Sakshi News home page

World Laughter Day 2025: పగలబడి నవ్వేందుకు పది కారణాలు...

May 4 2025 3:56 PM | Updated on May 4 2025 5:28 PM

World Laughter Day 2025: Why is Laughter Important for Health

'సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మా'..అంటున్నారు నిపుణులు. నవ్వు నాలుగు విధాల చేటు కాదు ఆరోగ్యం అని ఘంటాపథంగా చెబుతున్నారు. నవ్వడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండటమే గాక ఒత్తిడి తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ముఖం సదా నవ్వుతూ ఉండే సంబంధబాంధవ్యాలు కూడా సానుకూలంగా ఉంటాయట. నిజానికి 'నవ్వు' వైజ్ఞానికంగా చాలా మంచిది అనే విషయాన్ని హైలెట్‌ చేస్తోంది. ఇలా ఎందుకు అంటున్నారంటే..

నవ్వు ఆరోగ్యానికి ఎందుకు మంచిదంటే..

  • రోగనిరోధక శక్తిని పెంచుతుంది - ఇది యాంటీబాడీల ఉత్పత్తిని పెంచి రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.

  • గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది - నవ్వడం వల్ల రక్త ప్రసరణ సక్రమంగా ఉండి రక్తపోటును తగ్గుతుంది. 

  • ఒత్తిడిని తగ్గిస్తుంది - నవ్వు కార్టిసాల్ (ఒత్తిడి హార్మోన్)ను తగ్గిస్తుంది, మరింత రిలాక్స్‌గా ఉండటానికి సహాయపడుతుంది.

  • మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది - ఇది శరీరం సహజ అనుభూతిని కలిగించే రసాయనాలు అయిన ఎండార్ఫిన్‌ల విడుదలను ప్రేరేపిస్తుంది.

  • సామాజిక బంధాలను బలపరుస్తుంది - నవ్వుతూ ఉంటే అందరు మనతో మాట్లాడటానికి, ఉండటానికి ఇష్టపడతారు. తద్వారా సమాజంలో ఇతరులతో మంచి సంబంధాలనే కుటుంబ సంబంధాలు కూడా బాగుంటాయి. ఆహ్లాదకరమైన సానుకూల వాతావరణాన్ని సొంతం చేసుకోవచ్చు. 

  • నొప్పిని తగ్గిస్తుంది - డోపమైన్ ఉత్పత్తిని ప్రేరేపించి..వివిధ రుగ్మతల నివారిణిగా పనిచేస్తుంది.

  • సానుకూలతను ప్రోత్సహిస్తుంది - అంతేగాదు మనలో తెలియని కాన్ఫిడెన్స్‌ పెరిగి ఎలాంటి సవాళ్లనైనా సులభంగా అధిగమించగలుగుతారు. 

  • మానసిక ఆరోగ్యానికి మద్దతిస్తుంది - నవ్వు విశ్రాంతిని ప్రోత్సహించి ఆందోళన, నిరాశను తగ్గిస్తుంది.

  • ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది - గాఢమైన నవ్వు డయాఫ్రాగమ్‌కు మంచి

  • వ్యాయామంగా పని చేస్తుంది. పైగా శ్వాసక్రియను మెరుగ్గా ఉంచుతుంది. 

  • దీర్ఘాయువును ప్రోత్సహిస్తుంది - ఎక్కువగా నవ్వే వ్యక్తులు ఎక్కువ కాలం, ఆరోగ్యంగా జీవిస్తారని అధ్యయనాలు సైతం సూచిస్తున్నాయి.

కావునా హాయిగా మనస్ఫూర్తిగా నవ్వేద్దాం..చక్కటి ఆరోగ్యాన్ని పొందుదాం. ]

(చదవండి: Summer Weight Loss Tips: బరువు తగ్గేందుకు బెస్ట్‌ సీజన్‌..! ఎలాంటి ఫుడ్‌ తీసుకోవాలంటే..)
 

Advertisement
 
Advertisement
Advertisement