నిత్య ‘కళ్యాణం’.. ‘పచ్చ’తోరణం.. | An interesting Satirical story about a serial groom | Sakshi
Sakshi News home page

నిత్య ‘కళ్యాణం’.. ‘పచ్చ’తోరణం..

Nov 13 2026 5:04 PM | Updated on Nov 13 2026 5:04 PM

An interesting Satirical story about a serial groom

ప్రపంచ వివాహ సమాఖ్య వారి ని.పె.కొ (నిత్య పెళ్లి కొడుకు) పురస్కారం కల్యాణం కుమార్‌(కె.కె)ను వరించింది. తెలుగు వ్యక్తికి ఈ పురస్కారం దక్కడం ఇదే తొలిసారి. తనకు ‘ని.పె.కొ’ అవార్డ్‌ వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని పాత్రికేయుడు అగ్నిపర్వతం (ఏపీ)కి ఇంటర్వ్యూ ఇచ్చాడు కె.కె.

ఏపీ: ‘నిత్య పెళ్లికొడుకు’ పురస్కారం రావడంపై మీ స్పందన ఏమిటి?
కె.కె: ఇది తొలి అడుగు మాత్రమే. సాధించాల్సింది ఇంకా ఎంతో ఉంది.
ఏపీ: అంటే... భవిష్యత్తులో మరిన్ని పెళ్లిళ్లు చేసుకుంటారా?
కె.కె: చేసుకుంటే తప్పేమిటి? నువ్వు కూడా చేసుకో, ఎవరొద్దన్నారు. నా పెళ్లి నా ఇష్టం.
ఏపీ: ప్రజాజీవితంలో ఉన్నప్పుడు కొన్ని విలువలు పాటించాలి కదా. ‘మళ్లీ మళ్లీ పెళ్లి’ కాన్సెప్ట్‌ ద్వారా యువతకు ఎలాంటి సందేశం ఇస్తున్నారు?
కె.కె: ఎవరికి ఎవరూ సందేశం ఇవ్వరు. ఎవరికి వారే ఇచ్చుకోవాలి. సందేశాల విషయంలో నేను చాలా పొదుపుగా ఉంటాను. ఎన్నికల టైమ్‌లో మాత్రమే సందేశాలు ఇస్తుంటాను.

ఏపీ: ‘నిత్యకళ్యాణం పచ్చతోరణం’ పేరుతో ఒక ప్రాజెక్ట్‌ ప్రారంభిస్తున్నారని, ప్రభుత్వ అధినేత ఆమోదం లభించిందనీ అంటున్నారు. ఈ ప్రాజెక్ట్‌ గురించి వివరాలు చెబుతారా?

కె.కె: మంచి ప్రశ్న. ‘నిత్య కల్యాణం–పచ్చ తోరణం’ అనేది కేవలం పురుషులను దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్ట్‌. కొత్త సంవత్సరంలో ఈ ప్రాజెక్ట్‌ అమల్లోకి వస్తుంది. మీరు గమనించాల్సి విషయమేమిటంటే, ఈ ప్రాజెక్ట్‌ ‘పెళ్లి’ చేసుకునేవారి కోసం కాదు. ‘పెళ్లిళ్లు’ చేసుకునేవారి కోసం.‘ఒకే పెళ్లి అయిందని నిరాశ పడకండి. ఎన్ని పెళ్లిళ్లు అయినా హ్యాపీగా చేసుకోండి’ అని మా ప్రాజెక్ట్‌ ద్వారా యువతకు సందేశం ఇవ్వదలిచాం.

మీరు మూడో పెళ్లి, నాలుగో పెళ్లి, ఆరో పెళ్లి... ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నా సరే మా ప్రాజెక్ట్‌ మీకు అండగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల నుంచి న్యాయ సలహాల వరకు అన్నీ ఉచితంగా సమకూర్చుతాం.

ఏపీ: ఇంతేనా.. ఇంకేమైనా ఉందా?
కె.కె: అయిదు కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న వారికి ‘అపూర్వ కల్యాణ రత్న’, పది కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న వారికి ‘కళ్యాణ చక్రవర్తి’ అవార్డ్‌లను ఇచ్చి ప్రోత్సహించాలనుకుంటున్నాము.

ఏపీ: మహిళల కష్టాలపై ‘మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా’ అని పాడారు కదా! మీ వ్యవహారానికి, ఆ పాటకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. ఏమంటారు?
కె.కె: నేను ఏమీ అనుకోను. ఎవరైనా అనుకున్నా పట్టించుకోను. ప్రస్తుతం నా దృష్టి అంతా నాలుగో పెళ్లి గురించే. ఆ తరువాతే ఏదైనా. మరో ముఖ్య విషయం ఏమిటంటే... మా పార్టీ పేరును ‘బ్యాండ్‌ మేళం’ లేదా ‘మ్యారేజ్‌బ్యూరో’ లేదా ‘భాజాభజంత్రీలు’గా మార్చాలనుకుంటున్నాం. బాగుంది కదూ!
– యాకుబ్‌ పాషా 

ఇదీ చదవండి: ఆ యువకుడి టాలెంట్‌కి కిరణ్ మజుందార్-షా ఫిదా..! నెట్‌ లేకుండానే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement