
పెండింగ్ పనులు పూర్తిచేయాలి
మంచిర్యాల నుంచి మహారాష్ట్ర సరిహద్దు వరకు నిర్మించిన జా తీయ రహదారి పనుల్లో అక్కడక్కడ చిన్నచిన్న పనులు పెండింగ్‌లో ఉన్నాయి. హైవే పక్కన ఉన్న సర్వీసు రోడ్లు, డ్రెయినేజీ నిర్మాణం, లైనింగ్ వంటి పనులు పూర్తికాలేదు. వాటిని వెంటనే పూర్తిచేయాలి. రెబ్బెన మండలంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన గంగాపూర్ బాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే దారిలో అడ్డంగా ఉన్న రైల్వేగేట్ వద్ద ఓవర్ బ్రిడ్జి నిర్మించాలి. అటవీశాఖ అనుమతులు లేని కారణంగా జిల్లాలో మంజూరైన అనేక రోడ్లు ప్రారంభం కావడం లేదు. ముఖ్యంగా ఆదివాసీ గ్రామాల్లో రోడ్ల పనులు చేపట్టేందుకు అటవీశాఖ అనుమతులు త్వరగా వచ్చేలా కృషి చేయాలి.
– ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి