
యువత క్రీడల్లో రాణించాలి
కౌటాల: గ్రామీణ యువత క్రీడల్లో రాణించా లని మాలీ సంఘం నాయకుడు మోర్లె పాండురంగ్ పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి మండలంలోని కన్నెపల్లి గ్రామ యువకులకు ఆయన వాలీబాల్, క్రికెట్ కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత చదవులో ముందుండాలని, క్రీడలతో ఉజ్వల భవిష్యత్ ఉంటుందని పేర్కొన్నా రు. ఆటలు శారీరక, మానసిక ఆరోగ్యానికి దోహదపడతాయని తెలిపారు. ఐకమత్యాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. యువత నిత్యజీవితంలో క్రీడలను భాగం చేసుకోవా లని సూచించారు. గ్రామీణ యువతకు అన్ని విధాలా సహకారం అందిస్తామని తెలిపారు.