అదనపు కలెక్టర్‌ నివాసంలో షార్ట్‌ సర్క్యూట్‌ | - | Sakshi
Sakshi News home page

అదనపు కలెక్టర్‌ నివాసంలో షార్ట్‌ సర్క్యూట్‌

Apr 28 2025 12:10 AM | Updated on Apr 28 2025 12:10 AM

అదనపు కలెక్టర్‌ నివాసంలో షార్ట్‌ సర్క్యూట్‌

అదనపు కలెక్టర్‌ నివాసంలో షార్ట్‌ సర్క్యూట్‌

ఆసిఫాబాద్‌: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ ఆవరణలో గల అదనపు కలెక్టర్‌ ఎం.డేవిడ్‌ నివాసంలో ఆదివారం సాయంత్రం షార్ట్‌ సర్క్యూట్‌ జరిగింది. ఇంట్లోని ఏసీ నుంచి ఒక్కసారిగా పొగ, మంటలు వ్యాపించాయి. గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఇంట్లోని బీరువా, అందులోని పుస్తకాలు, రెండు ల్యాప్‌టాప్‌లు, ఫర్నిచర్‌, మంచం కాలిపోయాయి. సుమారు రూ.4.5 లక్షలు నష్టం వాటిల్లినట్లు ఫైర్‌ అధికారి కార్తీక్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement